విద్యార్థులకు గుడ్ & బ్యాడ్ టచ్, ప్రేమ, చీటింగ్, మాదక ద్రవ్యాల వలన జరిగే అనార్ధాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది మంగళవారం పలు పాఠశాలు/కళాశాలల్లోని విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ప్రేమ, చీటింగ్, లైంగిక దాడులు, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనార్ధాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై మరియు డయల్ 100/112 సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముఖ్యంగా విద్యార్థినులకు “గుడ్ టచ్” మరియు “బ్యాడ్ టచ్” మధ్య తేడా తెలుసుకోవడం, అనుమానాస్పద వ్యక్తులు, వారి వ్యవహారశైలిని గుర్తించడం మరియు స్వీయ రక్షణ, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్ మరియు చట్టాలపై కూడా అవగాహన కల్పించారు.

పిల్లలు స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా వినియోగిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరణ ఇచ్చారు. ఫేక్ ఎస్ఎంఎస్ లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు నుండి అని ఫోన్లు, లింకులు పంపి చేసే చేసి మీ కేవైసీ పెండింగ్ అని జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అనగా పోలీస్, సిబిఐ, వివిధ ఉన్నత శాఖల అధికారులంటూ ఫోన్ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి ఇతర సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒకవేళ సైబర్ క్రైమ్ లో బాధితులయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపడం ద్వారా కొంతమేర నష్టపోయిన డబ్బును తిరిగి పొందచ్చని తెలపడం జరిగింది.

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక సమస్యలను వివరించారు, గంజాయి లాంటి డ్రగ్స్ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కేసులు నమోదు చేయబడతాయని, ఒకసారి డ్రగ్ కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డ్స్ లో పేరు నమోదయ్యితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, పాస్ పోర్ట్, వీసాల వంటివి రావని, కావున మాదకద్రవ్యాలు మీ దరి చేరకుండా స్మార్ట్ గా వ్యవరించాలని, యువత ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోని బంగారు జీవితాన్ని బాటలు వేసుకోవాలని సూచించారు.

ప్రతిరోజు జరుగుతున్న యాక్సిడెంట్లు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు, ఇన్సూరెన్స్లు చేపించుకోవడం, రహదారులపై హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం వంటి అనేక ముఖ్యమైన ట్రాఫిక్ నియమాలు గురించి విద్యార్థులకు వివరించారు.

ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు వారి సహాయం పొందాల అంటే అటువంటి సమయంలో డయల్ – 100/112 కు కాల్ చేయడం ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని నుండి సత్వర సహాయం అందుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *