దర్శి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందిరాగాంధీ107 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి మాట్లాడుతూ… మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణం చేసినారని, గరీబీ హటావో కింద ఎస్సీ ఎస్టీ నిరుపేదలైన బీసీ మరియు మైనార్టీ అందరికీ 5 ఎకరాల పొలము మరియు ఇందిరమ్మ గృహములు ఇచ్చి అనేకమైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఇరిగేషన్ ప్రాజెక్టు లు…నీటిపారుదల అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేసినారని, ఉక్కు మహిళల గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఇందిరమ్మ నేటి మహిళలకు ఆదర్శమని అన్నారు కార్యక్రమం దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి , తాళ్ళూరు మండల అధ్యక్షులు కొప్పుల సాయి కృష్ణ ,బిసి సెల్ అధ్యక్షులు వల్లెపు శంకర్, కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
