భారతరత్న ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ మరియు అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ… భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ప్రతినిధిగా బ్యాంకుల జాతీయకరణం చేసి ప్రతి సామాన్య మనిషి కూడా బ్యాంకు యొక్క లావాదేవీలను జరుపుకునే విధంగా లబ్ధి పొందేందుకు ఎంతో కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీ కి దక్కుతుందని, “ఇందిరమ్మ నాయకత్వం భారతదేశ చరిత్రలో అసాధారణ మని అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, గరీబీ హటావో నినాదం, 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం వంటి గొప్ప సంస్కరణలు మరియు విజయాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపాయని చెప్పారు. భారతదేశ సవాళ్లను ఎదుర్కొని, పేదల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమైంది,” భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం వదిలి చివర రక్త బిందువు వరకు కూడా దేశ అభివృద్ధికి పాటు పడ్డారని ….అలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు అందించాలని …..భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారని ఆమె సేవలను కొని ఆడారు . ఇందిరాగాంధీ ఆశయాలను మనందరం కూడా ఆచరించి ….కాంగ్రెస్ పార్టీ అయితే నే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని దానికి అనుగుణంగా అందరం కూడా కృషిచేసి కేంద్రంలో మరియు రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు సుదర్శన్ రెడ్డి, కాసిం పేరా, వెంకయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహనాయుడు, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

