పంటల ధరలను విశ్లేషించి అంచనా వేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ….పంట ఉత్పత్తుల ముందస్తు ధరల అంచనా కలిగి ఉండడం అత్యంత అవసరమని అన్నారు. పంటల రకాలు, నాణ్యత, ఎగుమతులు ,దిగుమతులు తదితర వాటి మూలంగా ధరలను అంచనా వేసి వ్యవసాయ, ఆర్థిక శాఖ విభాగాలు తెలియచేస్తాయని అన్నారు. నేటి అంచనా ప్రకారం వరి క్వింటాకు రూ. 2,400 ,మొక్కజొన్న రూ.2,220,జొన్న రూ.3,190 రూపాయలు, మిరప రూ.16,500, కంది రూ.9,800, మినుము రూ. 7,500 .పెసలు రూ. 7,750 మార్కెట్ అంచనాలుగా కలిగి ఉన్నాయని, ఇవి వాటి రకాలు, నాణ్యతలను బట్టి మారే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వి. ఏ. ఏ లు కే వీరాంజనేయులు, భార్గవి రైతులు పాల్గొన్నారు.


