బాలల హక్కుల వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ తప్పెట డేవిడ్ ఆధ్వర్యంలో తాళ్లూరు ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాళ్లూరు ఎంఈఓ జి సుబ్బయ్య మాట్లాడుతూ… ప్రతి ఒక్క విద్యార్థి బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలని బాల్య వివాహాలు గురించి మరియు బాలల హక్కుల పై అవగాహన కల్పించారు.. కార్యక్రమంలో తాళ్లూరు పంచాయతీ కార్యదర్శి ఐ వి రమణ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే పెద్దిరెడ్డి , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచి పెట్టారు.
