భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని రాంనగర్ మొదటి వీధిలో ఉన్న వారి యొక్క కార్యాలయంలో ఏర్పాటుచేసినా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను మహిళా మోర్చ నాయకురాళ్ళు మరియు అక్కడున్న పెద్దలతో కలిసి నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ ….ఝాన్సీ లక్ష్మీబాయి ధీరత్వం, ఆవిడ చూపించిన తెగువ, స్త్రీ మూర్తులకు వారియొక్క స్ఫూర్తివంతం కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మహిళా మోర్చ జిల్లా ఇంచార్జి & జిల్లా కార్యదర్శి తిగల సత్యవతి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శులు దేవరపల్లి శ్రీలక్ష్మి, మరియు ధనిశెట్టి పావని, కాలనీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఝాన్సీ లక్ష్మీబాయికి నివాళులర్పించారు.

