చూపరులను సైతం బావోద్వేగానికి గురి చేసిన ఘటన హైదరాబాద్‌లో చేటుచేసుకుంది. ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి కూతుళ్లు ఒక్కసారిగా బావోద్వేగానికి లోనయ్యారు. మతిస్థిమితం కోల్పోయి బాలయ్య ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్యని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ‘ఆశ్రయం’ కల్పించడం జరిగింది. నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య ఆదే ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకుల వద్ద తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడంటూ ఆ కూతుళ్లు వాపోయారు. అదే క్రమంలో మంగళవారం కూడా మాతృదేవోభవ ఆశ్రమంలో అన్నదానం చేయడానికి వచ్చిన బాలయ్య కూతుళ్లకు తప్పిపోయిన తమ కన్న తండ్రి కనిపించారు. ఆ ఆశ్రమంలోని 130మందిలో తమ తండ్రిని గుర్తుపట్టారు. దాంతో ఒక‍్కసారిగా తమ తండ్రిని హత్తుని కన్నీంటిపర్యంతమయ్యారు. ఆ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ తండ్రిని ఇంత కాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇంతకాలం కన్నతండ్రి ప్రేమకు దూరమైన ఈ కూతుళ్లకు ఎట్టకేలకు తమ తండ్రిని చేరుకోగలిగామంటూ… ఈ మధురమైన క్షణం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. నిజంగా ఉన్నపుడు మనకు ఈ నాన్న విలువ తెలియదు. ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోండి . వారిని ప్రేమించండి, పూజించండి.




