కాళిదాస్ సేవా సమితి నిర్వాహకులు తీగల కేదార్నాథ్ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక మంగమూరు రోడ్డు లోని రాధా గోవింద ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు గో సేవయే గోవిందుని సేవగా భావించి ఆశ్రమంలోని గోవులకు దానా సమర్పించారు. ఈ సందర్భంగా తీగల సత్యవతి మాట్లాడుతూ …మంచి వక్త, రచయిత, దేశభక్తి మెండుగా గల మా మామగారు తీగల కాళిదాసు పేరున తీగల కాళిదాస్ సేవా సమితి ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పుట్టినరోజు వేడుకలు అంటూ డబ్బును వృధాగా ఖర్చు చేయడం కంటే మన సనాతన ధర్మం ప్రకారం జన్మదిన వేడుకల్లో మొక్కలు నాటడం, గో సేవ చేయడం, అనాధలు, అభాగ్యులకు చేయూతనివ్వడం ద్వారా జన్మ సార్ధకత పొందుతుందని ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ దాస్ తెలిపారు.
కార్యక్రమంలో ధనిశెట్టి పావని, తీగల సత్యవతి, తీగల కేదార్నాథ్, ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ దాస్ మరియు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.


