కస్తూరిభా గాంధీ పాఠశాలను బుధవారం ఎంపీడీఓ సుందర రామయ్య, ఎంఈఓ జి సుబ్బయ్యలు తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో రక్తహీనతో బాధపడుతున్న విద్యార్థుల గురించి ‘ సరైన వైద్యం అందించలేరా…’ అంటూ జె ఎస్ డి ఎం న్యూస్ లో ప్రచురితం కావటంతో స్పందించిన అధికారులు పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేసారు. పలువురు రక్తహీనతో, జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. విద్యార్థులు 6 గ్రాముల నుండి 8 గ్రాములు రక్తం ఉన్నట్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గుర్తించారు. వారి ఆరోగ్యంపై సరియైన శ్రర్థ తీసుకోని ఆరోగ్య కార్యకర్తకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. పరసరాలు దుర్వాసన రావటం గమనించి మురుగు నీటి కాలువ శుభ్రత చేయించాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. డైనింగ్ హాల్, వంట శాలలో శుభ్రతగా లేక పోవటం గుర్తించారు. విద్యార్థులు సరియైన డైట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, ఎవైనా ఇబ్బందులు ఉంటే తెలియజెయ్యాలని కోరారు. ప్రిన్సిపాల్ సుజిత తదితరులు పాల్గొన్నారు.


