అర్హలైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సంజీవ రావు కోరారు. వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ సంజీవ రావు మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని 18 సంవత్సరములు నిండిన వెంటను తమ ఓటును ఆన్ లైన్ లో లేదా బీఎల్.ఓ ల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై కాలేజి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లెక్చరర్ గురవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
