ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ ద్వారా పోస్ట్ మెట్రిక్ కు
అర్హలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు జ్ఞాన భూమి సైట్ లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి లక్ష్మానాయక్ కోరారు. జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాల వారు ఈనెల 30వ తేదిలోపు విద్యార్థులను జ్ఞాన భూమి సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయ్యాలని కోరారు. విద్యార్థులు వారి మండలాలు, గ్రామాలలో సచివాలయాల పరధిలో వేల్ఫేర్ అసిస్టెంట్స్, విద్యా సహాయకులను సంప్రదించి ఫైప్ స్టెఫ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని, కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు త్వరిత గతిన విషయాన్ని తెలియజేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయ్యాలని కోరారు.
