ప్రజలకు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వలన జరిగే అనార్ధాలు, గుడ్ & బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాలు మరియు నివారణలపై జిల్లాలోని పోలీసు అధికారులు మరియు గ్రామ/వార్డు మహిళా పోలీసులతో గురువారం జిల్లా ఎస్పీ
ఏఆర్ దామోదర్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ మాట్లాడుతూ …}మహిళా పోలీసులు “గుడ్ టచ్” మరియు “బ్యాడ్ టచ్” మధ్య తేడా తెలియజేయడం, అనుమానాస్పద వ్యక్తులు, వారి వ్యవహారశైలిని గుర్తించడం మరియు స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, వరకట్నం మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, పిల్లలు నేరాలకు గురికాకుండా మనము ముందుగానే అవగాహన కల్పించడం మేలు అని తెలిపారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలు ముఖ్యంగా ప్రజల అత్యాశ, భయాందోనలను ఆసరాగా చేసుకొని ఫేక్ ప్రొఫైల్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమ్స్, కేవైసీ, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అపరిచితుల నుంచి ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్‌ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, బ్యాంకు, సిబిఐ, పోలీస్, ఈడి, కస్టమ్, ఏసీబీ మరియు ఇతర శాఖల అధికారుల్లా వాయిస్/వీడియో కాల్ చేసి ముందుగానే సేకరించిన మీ వివరాలన్నీ చెప్పి భయపెట్టి చేసే మోసాలు, చీటీ పాటలు, జాబ్ ఫ్రాడ్స్ మరియు ఇతర నేరాలు గురించి మహిళా పోలీసులకు వివరించి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
ట్రాఫిక్ రూల్స్ గురించి, రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణాల్లో పాటించాల్సిన మెళకువులు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగోట్టుకోవడం కుటుంబాలపై పడే ప్రభావాలు, మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకు తెలియాచేయాలన్నారు. వాహనదారులు వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఓవర్ స్పీడ్ వెళ్లరాదని, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలుంటాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు అందరు తప్పక పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలు గురించి, కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డ్స్ లో పేరు నమోదయ్యితే భవిష్యత్తుతో తలెత్తే సమస్యలు, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిసలైతే జీవితాలు ఎలా నాశనమవుతాయో, మాదక ద్రవ్యలకు దూరంగా ఉండే విధంగా మరియు ఎప్పుడు మంచి వాతావారణంలో ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోని ఉజ్జ్వల భవిష్యత్ వైపు నడిచేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
గ్రామ/వార్డు స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గురించి, అసాంఘిక కార్యకాపాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా సేకరించి సంబంధిత అధికారులకు తెలియపరచి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) నాగేశ్వర రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, IT కోర్ సీఐ V. సూర్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


