చింతపాలెం గ్రామ భూముల విష
యంలోఎస్సీ, ఎస్టీలసాగుకు ఆటం కల్గించిన అగ్రకులస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎస్సీఎస్టీలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పరిరక్షణ అధ్యక్షులు నీలనాగేంద్రరావు తాళ్లూరు తహసీల్దార్ కె.సంజీవరావుకువిన్నవించారు.
దళిత హక్కుల పరిరక్షణ నేతలు గురువారం సాయంత్రం స్థానికతహసీల్దార్ కార్యాలయంలో తహ సీల్దార్ తో మాట్లాడారు. చింతలపాలెం గ్రామంలో 50 ఎకరాల భూమి అగ్రవర్ణకుల స్తులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నా…. పట్టించు కోకుండా, భూమి లేని నిరు పేద ఎస్సీఎస్టీలు15ఎకరాల భూమి సాగుచేసుకుంటుండగా వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునేందుకు యత్నించటం ఎంత వరకు న్యాయమన్నారు. ఎస్సీ, ఎస్టీలుసాగు చేసుకుంటున్న భూములపై కన్నేసిన అగ్రవర్ణ కులస్తులు ఆభూమిని కబ్జా చేసేందుకు దున్నటం జరిగిందన్నారు. అగ్రవర్ణకులస్తులు సొంత భూములు ఉన్నప్పటికి ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించేం దుకు యత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు అగ్రవర్ణకులస్తులు అండగా నిలవటం వల్లే ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన యడ్ల యల్లయ్య ఎస్సీఎస్టీలు సాగు చేసుకుంటున్న పంటను ద్వంసం చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదన్నారు. ఈ విషయాన్ని జేసీ దృష్టికితీసుక వెళ్లగా ఆగ్రామంలో ఆక్రమణల్లో నున్న భూముల న్నింటిని గుర్తించాలని ఫోన్ ద్వారా ఆదేశించి రెండు నెలలురోజులు కావస్తున్నా అమలు చేలేదన్నారు. అగ్రవర్ణకులస్తులతో రెవెన్యూ అధికారులు కుమ్ముకై నిరుపేద ఎస్సీ, ఎస్టీ సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేసి, అగ్రవర్ణ కులస్తుల ఆక్రమణ భూముల బోర్డుల్లో ఏర్పాటు చేయక పోవటం కుల వివక్షత కాదా అని ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్ సంజీవరావు మాట్లా డుతూ…. వివాదంగా వున్న ఆక్రమణభూములను పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారి వివరాలు సేకరించి, భూమిలేని నిరుపేదలకున్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో డిటీ జె. ఇమ్మానియేల్ రాజు, జిల్లామాలమహానాడు అధ్యక్షులు దారా అంజయ్య, ఎమ్మా ర్పిఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అపనపర్తి ఆదామ్ మాదిగ, కాకుమాను రవి, గిరిజన సంఘం నాయకులు గంటా సుబ్బారావు, జనుమాల వెంకటేశ్వర్లు, తదితరులు వున్నారు.

