అంధులు ఎందులోనూ తక్కువ కాదు….- తెలుగు రాష్ట్రాల్లో అంధ విద్యార్థుల కోసం -“ఎంఎంఆర్ ఫౌండేషన్” వినూత్న సేవా ప్రయత్నం- డిఎస్సీ, టెట్, కాంపిటేటివ్ పరీక్షల సిలబస్ రికార్డింగ్- ఆడియో సిడీని ఆవిష్కరించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్డా.నూకసాని బాలాజీ

ఎంఎంఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంధ విద్యార్థుల కోసం ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిఎస్సీ, టెట్, కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను రికార్డింగ్ చేయించారు. ఫౌండేషన్ చైర్మన్ మక్కెన థామస్ నేతృత్వంలో జరిగిన ఈ ఆడియో రికార్డింగ్ సీడీని శుక్రవారం భాగ్యనగర్ 3వ లైన్లో ఉన్న ప్రకాశం జిల్లా టిడిపి కార్యాలయం ఆవరణలో *డా.నూకసాని బాలాజీ* చేతుల మీదగా ఆవిష్కరణ జరిగింది.

ల్యాప్ టాప్లో ఆడియో రికార్డింగ్ను అన్ చేసి ఆయన విన్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డా.నూకసాని బాలాజీ మీడియాతో మాట్లాడుతూ అంధులు ఎందులోనూ తక్కువ కాదన్నారు. సామాన్య మనిషి కన్నా ఎక్కువ మేధా శక్తి ఉంటుందని కొనియాడారు. అలాంటి వారి భవిష్యత్తుకు సంబంధించిన కాంపిటేటివ్ పరీక్షల సిలబస్ ని వారికి అనుకూల రీతిలో అందించడాన్ని ఎంఎంఆర్ ఫౌండేషన్ను అభినందించారు. ఈ అవకాశాన్ని అంధ విద్యార్థులు అందిపుచ్చుకొని మంచి ఉద్యోగాలు పొంది భవిష్యత్తులో పై స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో కూడా ఫౌండేషన్ చైర్మన్ మక్కెన థామస్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని నూకసాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మక్కెన థామస్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యం. అలాంటి విద్యను అందరికి సమాన రీతిలో అందాలని ఆకాంక్షతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంధ విద్యార్థుల కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను ఆడియో రికార్డింగ్ చేయించినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, పేస్ లెక్చరర్ కె. రాజ్ కిరణ్, సురేష్, తెలుగు రాష్ట్రాల అంధ విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *