ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించిన విత్తనాలను టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం రైతులకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ… రైతన్నల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పాటు పడుతుందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు, బ్లాక్ మార్కెట్ లో ఎరువుల దోపిడీ లేకుండా చూసేందుకు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలను ఎవరైనా అమ్మితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏడిఏ కే బాలాజీ నాయక్, ఏవో వి. బాలకృష్ణ నాయక్, విఏఏ అరుణ తదితర అధికారులు రైతులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


