ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం – ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు

ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఏపీఎస్‌ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్‌ ఛైర్మన్‌గా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగాల భర్తీపై సమాచారాన్ని వెల్లడించారు. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా విద్యుత్తు బస్సులు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. అందిన సమచారాం మేరకు ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్‌, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 వరకు ఉన్నాయి.

రైల్వే ఏఎల్‌పీ ఎగ్జామ్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. నవంబర్‌ 25 నుంచి పరీక్షలు

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ నియామక రాత పరీక్ష అడ్మిట్‌కార్డులను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలు నవంబర్‌ 25, 26, 27, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 వరకు ఉన్నాయి. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *