పంచాయితీ రికార్డుల డిజిటలైజేషన్ వేగవంతం చెయ్యాలని జిల్లా పంచాయితీ అధికారి గొట్టిపాటి వెంకట నాయుడు కోరారు. తాళ్లూరులో సచివాలయం -1, సచివాలయం -2లను ఆయన శనివారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇంటి పన్ను వసూలు పెంచి అసెస్ మెంటు నంబర్ల కేటాయింపు వేగవంతం చెయ్యాలని కోరారు. సచివాలయానికి సంబంధించిన పనులు త్వరితగతిన చేసే విధంగా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఖచ్చితమైన డేటాను అప్ లోట్ చేసే బాధ్యత పూర్తిగా గ్రామకార్యదర్శి దే అని స్పష్టం చేసారు. సచివాలయం -2లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేసారు. సిబ్బంది వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారని పూర్తి స్థాయిలో స్వచ్ఛత పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుందర రామయ్య, గ్రామకార్యదర్శి -2 కళ్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.
