ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు 2023, 2024 సంవత్సరాలలో టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ మద్యం కేసుల్లో 380 క్వార్టర్ బాటిల్స్, 16 ఫుల్ బాటిల్స్, మూడు బీరు బాటిల్లను ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాస్, ఎక్సైజ్ డీఎస్పీ పి.ఈ. వెంకట్, సింగరాయకొండ సిఐ సిహెచ్.హాజరత్తయ్య, ఎక్సైజ్ సీఐ ఈశ్వరరావు, టంగుటూరు ఎస్సై వి.నాగమల్లేశ్వరరావు మరియు టంగుటూరు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో 30 కేసుల్లోనే 399 బాటిల్స్ ను మరియు నాటు సారా కి సంబంధించిన కేసులోని 15 లీటర్ల నాటుసారాయిని టంగుటూరు లోని కొండేపి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేసారు.
జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు.

