పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ- మెప్మా ఆధ్వర్యంలో జిల్లా అర్బన్ మహిళా సమాఖ్యను ఏర్పాటు చేసుకొని, కొత్తగా జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీల కి సంబంధించిన TLF పతాదికారులు అందరూ పాల్గోని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.,
జి. భారతి – అధ్యక్షురాలు (ఒంగోలు-ఒ. సి)
డి. అంజమ్మ – ఉపాద్యక్షురాలు
( చీమకుర్తి, ఎస్సీ),
ఐ. రాధమ్మ – కార్యదర్శి (కనిగిరి-ఓ.సి)
ఎస్ . భాగ్యలక్ష్మీ – ఉప కార్యదర్శి (దర్శి, బీసీ)
ఎన్. ప్రమీల – కోశాధికారిగా (ఒంగోలు, ఎస్సీ)
పైన తెలిపిన 5గురు ఆఫీస్ బెరర్స్ గాను, మరో 7 మందిని కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరక్టర్ తేళ్ల రవికుమార్ పాల్గోని మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. ఉత్తేజంతో, చురుకుగా సంఘాలను సమాఖ్యలను బలోపేతం చేయాలనీ కోరారు.
ఈ సమావేశంలో TE లు బి. వి ఫణికుమారి , ఎన్.జయ కుమార్, దాసరి సంతోష్ కుమార్, కె.రాణీ గారు పాల్గొన్నారు.

