ఒంగోలు బస్టాండ్ వద్ద వాహనాలు రద్దీ వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న సందర్బంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఆధ్వర్యంలో ఒంగోలు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నిబంధనలలో మార్పులు చేశారు. ఇందులో భాగంగా లోపలికి వెళ్ళు ద్వారాన్ని (ఇన్ గెట్)ను బయటికి వెళ్ళు ద్వారం (అవుట్ గెట్ ) గా బయటకు వెళ్ళు ద్వారాన్ని (అవుట్ గేటు)ను లోనికివెళ్ళు (ఇన్ గెట్)గా మార్చి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వాహనాలు వెళ్లడానికి వీలుగా ట్రాఫిక్ నిబంధనలు మార్చడంతో పాటు డివైడర్ మధ్యలో భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. మారిన మార్పులు ను చూసిన ప్రయాణికులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
