2024- 25 విద్యాసంవత్సరంలో పోస్ట్ వెంట్రిక్ స్కాలర్ షిప్ మంజూరుకు నూతన మార్గదర్శకాలు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి లక్ష్మానాయక్ తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు స్టూడెండ్స్ ఖాతాలకు నగదు విడుదల చేస్తారరని చెప్పారు. మిగిలిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ఖాతాలకు నగదు మంజూరు చేస్తారని చెప్పారు. ఆయా విద్యార్థులకు ఎఫ్ ఆర్ ఎస్ హాజరు 60 శాతం ఉండాలని తెలిపారు. విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్స్, యాజమాన్యం విద్యార్థులను వివరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
