తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని రాములవారి దేవాలయంలో కార్తీక మాసం , కార్తీక శనివారం సందర్భంగా రాత్రి 8 గంటలకు దీపోత్సవ భజన కార్యక్రమంను నిర్వహించారు. మహిళా భక్తులు ప్రమిదలు , రంగవల్లులతో అలంకరణ చేశారు. పూజారు లు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

