ఇటీవల మహారాష్ట్ర ,జార్ఖండ్ ,ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి.ఈ సందర్భముగా ఒంగోలులో పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడి భాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భముగా బిజెపి ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ య్య యాదవ్ మాట్లాడుతూ….మహారాష్ట్రలో కనీ వినీ ఎరుగని రీతిలో బిజెపి విజయ ఢంకా మోగించి మోడీ నాయకత్వాన్ని మరొక్క సారి బలపిరిచిందని ఎన్నికలు జరిగిన అన్నిచోట్లా అవకాశవాద పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకీ మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్ ప్రజలు కర్రు కాల్సి వాత పెట్టారని, ఈ ఫలితాలు జాతీయ వాదానికి అనుకూలముగా వచ్చాయని, రాహుల్ గాంధీ దేశ ప్రజలను కులాలవారీగా విభజించాలని చూస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశ పరువు తీస్తున్నాడని, ఈ ఫలితాలు చూచిన తరువాతైనా కాంగ్రెస్ పార్టీ కుహనా లౌకిక వాదులు కు గుణపాఠం రావాలని కోరారు. ఈ కార్య్రమంలో బొద్దులూరి ఆంజనేయులు, ఐ సీతారామయ్య, రాయపాటి అజయ్. మాకినేని అమరసింహ, ఏ అనిల్.విజయ్ మోడీ, ఆంజనేయులు, కె రవి యాదవ్, పి మధు యాదవ్, ఎస్ రాజేష్ వర్మ,కటారి సుధాకర్ యాదవ్, పి రాజు యాదవ్, పి.ప్రసాదరావు, గుఱ్ఱం సత్యనారాయణ, గుఱ్ఱం రంగనాథ్, శివ, శేషు తదితరులు పాల్గొన్నారు.
