జిల్లా కేంద్రమైన ఒంగోలు లోని టీటీడీ కళ్యాణమండపం లో ఆదివారం జరిగిన యుటిఎఫ్ స్వర్ణోత్సవాల్లో తాళ్లూరు ప్రాంతానికి చెందిన సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు, సీనియర్ యుటిఎఫ్ నేతలను ఘనంగా సత్కరించారు. తాళ్లూరుకు చెందిన చిలకల చిన సుబ్బారెడ్డి, బొద్ది కూరపాడుకు చెందిన ఎస్.అంజిరెడ్డి, దారంవారిపాలెంకు చెందిన దారం వెంకటేశ్వర రెడ్డిలు యుటిఎఫ్ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. వారు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులుగా పని చేశారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా ముగ్గురు చేసిన కృషికి గుర్తింపుగా యుటిఎఫ్ పెద్దలు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.

