అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా
నమోదు చేసుకోవాలని దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వర రావు తెలిపారు. దర్శి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియను ఈఆర్వో లోకేశ్వరరావు తూర్పు గంగవరం పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ… మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్వోలు అందుబాటులో వుండి ధరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు. 2025 జనవరిలో ప్రచురితం కాబోయే ఓటర్ల జాబితా డ్రాప్ట్ లిస్ట్ ను అందు బాటులో వుంచుతూ కొత్త ఓటర్ల నమోదు, మృతుల ఓట్ల తొలగింపు, మార్పులు, చేర్పులపై తగు జాగ్రత్తలు చేపట్టాలని బియ ల్వోలకు సూచించారు. స్పెషల్ డ్రైవ్ క్యాంపెయిన్ డే రోజున పోలింగ్ కేంద్రాలను అర్హతగల ఓటర్లు వినియోగించుకుని ఓటు నమోదు చేసుకోవాలనారు. మండలం లో స్పెషల్ క్యాంపెయిన్ డే రోజున ఫామ్-6కు 9 ధరఖాస్తులు, ఫామ్-7కు 13 ధర ఖాస్తులు, ఫామ్-8కు 73 ధరఖాస్తులుఅందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.సంజీవరావు, డిప్యూటీతహసీల్దార్ జె.ఐ రాజు, బియల్వోలు తదితరులు
పాల్గొన్నారు.

