ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వర రావు, తో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. … ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పురస్కారింబడాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్జీదారుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.
ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 266 వినతులు వచ్చాయి.

జండర్ పోస్టర్ ఆవిష్కరణ:
…………………………….
UNICEF భాగస్వామ్యం తో SERP వారి ఆదేశముల ప్రకారం నాయి చేతన్ 3.0, 2024 జండర్ కాంపెయిన్ లాంచింగ్ ప్రోగ్రాంలో భాగంగా జండర్ పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలక్రిష్ణ, జిల్లా అధికారులతో కలసి ఆవిష్కరించి, పురుషులు, స్త్రీ లతో వేరువేరుగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. తదనంతరం జిల్లా సమాఖ్య ఈసి సభ్యులు ర్యాలీ చేసి వర్చువల్ లాంచింగ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.
ఈ ప్రోగ్రాం 25.11.2024 నుండి 23.12.2024 వరకు నాలుగు వారాల పాటు నాలుగు అంశాల మీద వారానికి ఒక అంశం చొప్పున వారంపాటు అదే అంశం పై SHG మెంబర్ స్థాయి నుండి VO, MS వరకు లైన్ డిపార్ట్మెంట్ వారిని అనుసంధానం చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ అనంతరం ప్రతివారం చివరలో రోజువారీగా చేసిన కార్యక్రమాల గురించి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేస్తూ MIS రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. నాలుగు వారాల కార్యక్రమాలు ఏమనగా మొదటివారం జండర్ ఆధారిత హింస, రెండవ వారం ఆడపిల్లలకు విద్య, మూడవ వారం బాల్య వివాహాలు, నాల్గవ వారం గృహ హింస ఈ అంశాల మీద నాలుగు వారాలు లైన్ డిపార్ట్మెంట్ వారిని అనుసంధానం చేసుకొని నిర్వహించవలసినదిగా జిల్లా కలెక్టర్ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో బి. చిరంజీవి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి వసుంధర, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఐసిడిఎస్ పిడి మాధురి, మెప్మా పిడి రవి కుమార్, డిపిఓ వెంకట నాయుడు, పశుసంవర్ధక శాఖ జెడి డా. బేబి రాణి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, డిడి మైన్స్ రాజశేఖర్, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *