ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు, స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి సమస్యలను ధైర్యంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ కి విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజలు వినతులను ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….
1 .దొనకొండ మండలం చెందిన ఇద్దరు వ్యక్తులు యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి తిరుగుతున్నారని ఒక బాధితుడు ఫిర్యాదు.
2.తన వద్ద ఉన్న కారును దర్శి టౌన్ కు చెందిన ఓ వ్యక్తి రూ.4,00,000 లకు కొనుగోలు చేసి రెండు లక్షలు చేతికి ఇచ్చి, మిగతా రెండు లక్షలు ఇప్పటికీ ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని ఒంగోలుకు చెందిన ఒక బాధితుడు ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్,SC/ST సెల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై రజియా సుల్తానా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

