మంచి వాతావరణంలో విద్యార్ధులు చదువుకునేలా అవసరమైన వసతుల కల్పనకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

జిల్లా లోని అన్నీ వసతి గృహాలలో మంచి వాతావరణంలో విద్యార్ధులు చదువుకునేలా అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఒంగోలు నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహము-2 మరియు 3 లను సందర్శించి, 329 మంది విద్యార్థినిలకు రూ.4,53,484/- ల విలువ గల బెడ్డింగ్ మెటీరియల్ (329 కార్పెట్స్ మరియు 329 బెడ్ షీట్స్) ను పంపిణి చేయటం జరిగినది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుచున్నదన్నారు. సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు గారు ఈ జిల్లాకు చెందిన వారైనందున జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు అందులో బాగంగా 550 కోట్ల రూపాయలతో అన్నీ వసతులతో ఈ వసతి గృహాన్ని ఆధునీకరించటానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అలాగే సింగరాయకొండలో సాంఘిక సంక్షేమ శాఖ ఆద్వర్యంలో కాలేజి వసతి గృహంతో నూతన కళాశాల మంజురుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ వసతి గృహాలలో చదువుచున్న పేద మరియు మద్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేసించుకొని ఆ కలను సాకారం చేసుకునేలా ప్రతి విద్యార్ధి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్ధి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా శిక్షణ పొందినప్పుడే అనుకున్న లక్ష్య్యం సాధించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా లోని 0 నుండి 18 వయస్సు గల పిల్లలందరూ ముఖ్యంగా బాలికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆరోగ్యంగా చక్కగా చదువుకొనేలా జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్ధులను చైతన్యపరుస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టుటకు ప్రభుత్వ పరంగా అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, బాల్య వివాహాలను అరికట్టుటలో విద్యార్ధులు కూడా బాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. ప్రభుత్వ పరంగా కల్పిస్తున్న వసతులు, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్ధేశించుకొని మంచి నడవడిక, క్రమశిక్షణతో ముందుకు వెళ్లి లక్ష్య సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు.

ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ అధ్వర్యంలో 81 ప్రీ మెట్రిక్ వసతి గృహములలో 7789 మంది విద్యార్ధి విధ్యార్దినిలు విద్యనభ్యసించుచున్నారని, సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, అమరావతి వారు రూ. 55,29,348.70/- విలువ గల బెడ్ షీట్స్ (ఒక బెడ్ షీట్ విలువ రూ. 668.28) మరియు రూ. 58,75,284.66/- విలువ గల కార్పెట్స్ (ఒక కార్పె ట్ విలువ రూ. 710.09) మొత్తము రూ. 1,14,04,633/- విలువ గల బెడ్డింగ్ మెటీరియల్ (7880 కార్పెట్స్ మరియు 7880 బెడ్ షీట్స్ ) ను అందజేసి 81 ప్రీ మెట్రిక్ వసతి గృహములకు పంపిణి చేయవలసినదిగా ఆదేశములు జారీ చేసియున్నారని సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఈ కార్యక్రమములో కార్యాలయ పర్యవేక్షకులు డి.మధు సూదన రెడ్డి , సహాయ సాంఘిక సంక్షేమాధికారి టి.లింగయ్య , వసతి గృహ సంక్షేమాధికారులు డి.అంక బాబు, జి.ముని కుమార్, ఎ.రఘువలు, యన్.ప్రభుదాసు , బి.శీరిష, కె.స్వప్న లతా, సి.హెచ్.సరిత దేవి, యం.అరుణ, కె.శ్రీలత, డి.దుర్గ లక్ష్మీ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *