కార్తీక దామోదర మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నగరంలోని గాంధీ రోడ్ లో గల ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘం, దేవాలయ కమిటి ఆధ్వర్యంలో ప్రత్యేక కోటి వత్తుల దీపోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన ఆలయ అర్చకులు శర్మ, ఫణిశర్మలు భక్తుల గోత్రనామాదులు పలికి అమ్మవాసవికి అష్టోత్తర పూజ నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం అంతా పూలతో అందంగా అలంకరించారు. ఒకపక్క విఘ్నేశ్వరుడు, మరోపక్క శంఖు చక్ర నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి త్రిదళము గల మహా నగరేశ్వరలింగమును పూబంతులతో చిత్రించారు.
పెద్ద సంఖ్యలో ఆలయమునకు విచ్చేసిన భక్తులు ఆమ్లకదీపాలను, కోటి వత్తుల దీపాలను వెలిగించి శివ కేశవుల స్తోత్రాలను అమ్మవారి అష్టకాన్ని పఠించారు ఆలయ తది ఆరాధన సంఘ సభ్యులు, ఆలయ కమిటి వారు కార్యనిర్వహణ చేశారు.





