పలువురు దివ్యాంగుల విన్నపం మేరకు వారికి అవసరమైన ట్రై సైకిళ్లు, సంక కర్రలు, వీల్ చైర్స్ ను జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా సోమవారం అందజేసారు. ఒంగోలు మండలం పెళ్లూరు గ్రామానికి చెందిన సుబ్బ రత్నంకు ట్రై సైకిల్ సంక కర్రలు, పామూరు మండలం బొట్ల గూడూరు కు చెందిన గంజి కొండల రావు కు వీర్ చైర్ ఉపకరణాలు జిల్లా స్పందన కార్యాలయం ఆవరణలో అందజేసారు. జిల్లా రెవిన్యూ అధికారి లక్ష్మి ప్రసన్న , జిల్లా విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ జెడీఏ అర్చన తదితరులు పాల్గొన్నారు.

