యువతీ, యువకులు సోషల్ మీడియాలో ఉన్న చెడు వైపు వెళ్లకుండా మంచిని అనుసరిస్తూ తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఎస్ఆర్ఆర్ మరియు సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాలలో సోమవారం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా దుర్వినియోగం మరియు బాధ్యులు కావటంపై అవగాహన కల్పించడం, సైబర్ బెదిరింపు మరియు వాటి ప్రభావంపై అవగాహన పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కు సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోషల్ మీడియా దుర్వినియోగంపై యువతలో అవగాహన కల్పించాలన్నారు. ఒక్కోసారి నాకే వ్యక్తిగతం స్మార్ట్ ఫోన్ ను తీసి పారెయ్యాలనిపిస్తుందన్నారు… దీనివల్ల మానవ సంబంధాలు చాలా దెబ్బతింటున్నాయన్నారు.. గతంలో కుటుంబమంతా కలసి ఎంతో ఆనందంగా గడిపేపేవాళ్లమని, ఇప్పుడు ఎవరి రూముల్లో వారు స్మార్ట్ ఫోన్ తో ఉండటానికి ఇష్టపడుతున్నామన్నారు.. అంతేకాకుండా మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయన్నారు.. మనకు తెలియకుండానే మనం సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నామన్నారు..
ఒకసారి నాకే మా అబ్బాయి గురించి ఫేక్ వార్త రాగా ఆ ప్రయత్నాన్ని నేను గట్టిగా తిప్పికొట్టానన్నారు.. అదేవిధంగా ఇటీవల నా నియోజకవర్గంలో రిటైర్డ్ అయిన ఒక నర్సు అకౌంట్ లోంచి దాదాపు రూ. 40 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారన్నారు.. ఏలూరు ఎస్పీ ఆధ్వర్యంలో వేగంగా విచారణ జరుగుతుందన్నారు.. అదేవిధంగా సూరత్ లో ఒక వ్యాపారి కుమార్డు గురించి ఫేక్ న్యూస్ చెప్పి దోచుకోవాలని చూశారు కాని వ్యాపారి అప్రమత్తంగా ఉండటంతో సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేకపోయారన్నారు. యువతీ, యువకులు తప్పు చేసి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. కుటుంబాల మీదకు తీసుకువచ్చి ఇబ్బందిపడవద్దన్నారు. నేను వ్యక్తిగతంగా సోషల్ మీడియా చూడను, పాలోకాను.. కాని చాట్ జీపీటీ ను చూస్తాను.. ఏదైనా సబ్జెక్ట్ కు సంబంధించిన సమాచారం కోసం వాడతానన్నారు. సైబర్ క్రైమ్స్ పై ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా యువతీ యువకులను కాపాడాలని ఇందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారన్నారు.
రాజకీయాల్లో సోషల్ మీడియా గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి, ఎంతో దూర ధృష్టితో విజనరీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అందుకే స్వర్ణాంధ్ర 2047 కు అడుగులు చేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నారని, మంచి విషయాల కంటే చెడు విషయాలకే సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారన్నారు. చెడు గురించి ఎక్కువగా మాట్లాడే వారికి నేడు ఆదరణ ఎక్కువగా ఉంటోందన్నారు. అలాంటి విషయాలను యువతీ, యువకలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. యువతీ, యువకలు చెడు వైపు వెళ్లకుండా మంచి వైపు పయనించి తమ జీవితాలన సరిచేసుకునే విథంగా సోషల్ మీడియాను మలచుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ను యువతీ, యువకులు విద్య, ఉపాధి, కమ్యునికేషన్ కు వేదికగా ఉపయోగించుకోవాలన్నారు.
విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని, మంచి కోసం సోషల్ మీడియాలోని సమాచారాన్ని వాడుకోవచ్చన్నారు. నాయకులు సోషల్ మీడియా ద్వారా మన ఇళ్లల్లోని మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని ముఖ్యంగా ఇందులో మన చెల్లి, తల్లి కూడా ఉండొచ్చన్నారు. ఎన్నో దూషణలతో కూడిన ఫొటోలను పెడుతున్నారని ఇలాంటి వాటిని నేటి యువత ఖండించకపోతే సమాజం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. మన కుటుంబ సభ్యుల్ని కించపరిస్తే మనం ఏవిధంగా ఇబ్బంది పడతామో తెలిసిందేనన్నారు. ఎన్ని పోస్టులు పెట్టినా దొరకం అని సైబర్ నేరగాళ్లు భావిస్తున్నారని.. కాని పోస్టులు పెట్టిన వారిని ప్రభుత్వం విడచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వార్తలను లైక్ చేయడం కాని ఫార్వర్డ్ చేయడం కాని చేయొద్దని, అలా చేసినా నేరాన్ని ప్రోత్సహించినట్టేనన్నారు. రాజకీయాల్లో ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులను ఖండించాలని కాని సోషల్ మీడియాలో వ్యక్తిక్వ హననానికి పాల్పడకూడదన్నారు. లోన్ యాప్ ల ద్వారా కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై ముఖ్యంగా యువతీ, యువకులు జాగరూకతతో అడుగులు వేయాలన్నారు. ఇలాంటి వాటికి సహకరించిన వారికి కూడా శిక్షలు పడతాయన్నారు.
సభా అధ్యక్షురాలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కే. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నేడు సాంకేతిక అనేది అభివృద్దికి అడ్రస్ గా మారుతుందన్నారు. ఒకసారి గూగుల్ తో కనెక్ట్ అయ్యామంటే మన ప్రతి మూమెంట్ తెలుసుకోవడం చాలా సులువు అవుతుందన్నారు. సోషల్ మీడియాపై యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వర్క్ షాపులో కాలేజీయేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, 23 డివిజన్ కార్పొరేట్ వి. రాజేశ్వరి, V తిరుమలేశ్వరి, చేకూరి శ్రీపతిరావు, డా. టీడీ విమల తదితరలు పాల్గొన్నారు.


