భ‌వ‌నాలు,లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం -టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్క‌ర‌ణ‌ల‌పై వేసిన క‌మిటీ రిపోర్ట్ కు సీఎం ఆమోదం-మున్సిప‌ల్ శాఖ‌పై ముగిసిన సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌. మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌ వెల్లడి

భ‌వ‌నాలు,లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌ వెల్లడించారు . 15 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ భ‌వ‌నాల నిర్మాణాల ప్లాన్ ల‌కు మున్సిప‌ల్ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేదని , లైసెన్సెడ్డ్ సర్వేయర్లు సంబంధిత ప్లాన్ ఆన్ లైన్ లో పెట్టి న‌గ‌దు చెల్లిస్తే అనుమ‌తి వ‌చ్చేస్తుందని , ఫౌండేషన్ వేసిన తర్వాత ఆన్ లైన్ లో అప్లై చేస్తే స‌రిపోతుందని , అంతా స‌క్ర‌మంగా ఉందో లేదో ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్ వెరిఫై చేస్తోందని , ఏమైనా అక్రమాలు జరిగితే స‌ర్వేయ‌ర్ల లైసెన్స్ రద్దు,క్రిమినల్ కేసులు న‌మోదు అవుతాయని తెలిపారు . దీనివ‌ల్ల 95 శాతం మంది మున్సిప‌ల్ ఆఫీస్ ల చుట్టూ తిరిగే అవ‌స‌రం ఉండ‌దని చెప్పారు . భ‌వ‌నాల అనుమ‌తుల‌కు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలవుతుందని అన్నారు . టీడీఆర్ బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునేలా అనుమతి ఉందని , 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్ కు అనుమతి అని , లే ఆవుట్లలో ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదిలేలా వెసులుబాటు ఇస్తున్నట్లు , టీడీఆర్ బాండ్ల అక్రమాలల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *