దర్శి లోని బూచేపల్లి నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం మాలధారణం నియమాల తోరణం అంటూ భక్తి భావనతో నివాస ప్రాంతం అంతా స్వాములు చేసిన భక్తి పాటలతో ఆ ప్రాంతం మారు మ్రోగింది.
దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసా రెడ్డి, నందినీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు కుటుంబ సమేతంగా హాజరై పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ఏర్పాటు చేసిన అరటి మండపం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేవతా వేషాధారుణలు అందరినీ ఆకర్షించాయి. విద్యుత్ లైటింగ్ ల మధ్య భక్తిశ్ర ద్ధలతో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో వివిధ దీక్షలు తీసుకున్న స్వాములు హాజ రయ్యారు.. అనంతరం అందరికీ బిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె తన్వికారెడ్డి, బూచేపల్లి వెంకా యమ్మలు ఆలపించిన అయ్యప్ప భక్తిగీతాలు అంద రినీ అలరించాయి.







