తాళ్లూరు మండలంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వక్తలు రాజ్యాంగం ప్రాముఖ్యతను గురించి వివరించారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీడీఓ సుందర రామయ్య, టిడిపి నాయకుడు శాగం కొండా రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. వికే ఉన్నత పాఠశాలలో ఎంఈఓ జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్, హెచ్ఎం శేష గిరి, కళాశాల ప్రిన్సిపాల్ కొండ పల్లి ఆంజనేయులు నివాళులు అర్పించారు. కస్తూరిభా పాఠశాలలో డిబిఆర్సీ రీజనల్ కోఆర్డినేటర్ దార కోటేశ్వర రావు, ఎంపీడీఓ సుందర రామయ్య, ప్రిన్సిపాల్ సుజితలు నివాళులు అర్పించారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సుబ్బా రావు. వెలుగు వారి పాలెంలో (ఎఎ)లో హెచ్ఎం పొలం రెడ్డి సుబ్బా రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొని నివాళులు అర్పించారు. ఎబీసీ హైస్కూల్లో కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, హెచ్ఎం వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబు, ఉపాధ్యాయులు పాల్గొని నివాళులు అర్పించి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.





