కస్తూరి బా ప్రాంగణాన్ని మంగళవారం అధికారులు శుభ్రం చేయించారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఎంపీడీఓ సుందర రామయ్య, గ్రామ కార్యదర్శి ఐ వీ రమణా రెడ్డి పనులను పర్యవేక్షించారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన అధికారులు పరిసరాల అపరిశుభ్రతను గమనించి ఎంపీడీఓ ఆదేశాల మేరకు పరిసరాలను జపాన్ తుమ్మచెట్లను తొలగించి, డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరచారు.
