గిరిజనలు అభ్యున్నతికిచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధ రావు అన్నారు. స్వాతంత్ర్య సమర యోథుడు బిర్సా ముండా 150 జయంతి ముగింపు కార్యక్రమాన్ని ఒంగోలులోని గిరిజన భవన్ లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీడబ్ల్యూఓ జగన్నాధ రావు మాట్లాడుతూ….. గిరిజన స్వాతంత్య్ర యోధులను గుర్తు చేసుకునేందుకు వారోత్సవాలు | హించినట్లు తెలిపారు. ఒంగోలులో గిరిజన వసతి ప్రత్యేక వసతి గృహం కోసం కలెక్టర్ అనుమతి తో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వై.పాలెంలో బాలి కల వసతి గృహం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఒంగోలు సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి. అమర సుబ్బయ్య, వై. పాలెం అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి చర్యలు – గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధ రావు
27
Nov