పురుగు మందుల పిచికారిలో ఎంతో జాగ్రత్త లు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని రామభద్రాపురం, నాగంబొట్ల పాలెం, తూర్పుగంగవరం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలలో సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన సమయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రామభద్రాపురం సర్పంచి బాపిరెడ్డి వెంకట లక్ష్మి, ఎటీఎం రామి రెడ్డి, విఏఏ వెంకట సుమ తదితరులు పాల్గొన్నారు.

