బాల్య వివాహ రహిత భారత దేశ నిర్మాణానికి కృషి చెయ్యాల్సిన ఆవశ్యకతను అధికారులు వివరించారు. బాల్య వివాహాలను అరికట్టటానికి బాల్య వివాహా ముక్త్ భారత్ క్యాంపైన్ కార్యక్రమం డిల్లీ విజ్ఞాన్ భవన్ లాంఛనంగా కేంద్ర శిశు శాఖా మంత్రి అన్నపూర్ణ ప్రారంభించారు. జిల్లా నుంచి వెబ్ నార్ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాధురి, వికలాంగుల సంక్షేమశాఖ జెడీ అర్చన పాల్గొన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో అందరి బాగస్వామ్యంతో విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.



