మార్కాపురం సబ్- డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ తేది:10.05.2023న మరణించిన హోమ్ గార్డ్ పి. శ్రీను (HG- 803) గారి సతీమణి పి. కాశమ్మ కి కారుణ్య నియామకం క్రింద హోమ్ గార్డ్ ఉద్యోగం కల్పిస్తూ నియామకపత్రాన్ని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ అందచేసినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరణించిన హోమ్ గార్డ్ యొక్క కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పోలీసులు ప్రజలకు మధ్య వారధుల్లా విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీసు శాఖ వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, హోమ్ గార్డ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
