ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని ఒకే ఒక్క సీఎంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచారని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులుతో సమావేశం బుదవారం జరిగింది. ముఖ్య అతిధులుగా హజరైన కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు దుశ్శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ .. ……కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి పొత్తులు లేకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలించారని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదన్నారు. ఉదయం గ్రామాల్లో ప్రోగ్రాంకు వెళ్లాలంటే ఎక్కడ హామీలు అడుగుతారో అని ………మధ్యాహ్నం వెళ్ళి వెంటనే వెనుదిరుగుతున్నారని చెప్పారు. ప్రతి పేద విద్యార్ధి డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజురియంబర్స్ మెంట్ ప్రవేశ పెడితే కూటమి ప్రభుత్వం ఆపధకాని నీరు గార్చిందన్నారు. కూలీ నాలీ చేసుకునేవారికి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వక పోతే వారు డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. అందరూ కలసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ …………పార్లమెంట్ పరిదిలో ఎమ్మెల్యేల కంటే ఎంపీ అభ్యర్థి అయిన తనకు 52వేల ఓట్లు అధికంగా వచ్చాయన్నారు. ఒకప్పుడు నంద్యాలలో ఈ పార్లమెంట్ కలసి ఉండేదని మనం అందరం ఒక చోట వారమే అని చెప్పారు. తనపై అభిమానం చూపిన నాయకులు, కార్యకర్తలు అభిమానుల కు ఏకష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాను బూచేపల్లి కుటుంబ సభ్యుడనేనని నాతమ్ముడు శివప్రసాద్ రెడ్డి తో కలసి జిల్లా లో అన్నీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ……… కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బలం అని చెప్పారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎంతో కష్ట పడి గెలిపించారని చెప్పారు. మళ్ళీ జరిగే ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలిపించుకునే లా గతంలో కంటే ఇంకా కష్ట పడి పార్టీ బలో పేతం చేయాలన్నారు. జగనన్న సీఎం గా ఉన్నప్పుడు అన్నీ పధకాలు అమలు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క పధకం కూడా అమలు చేయడం లేదన్నారు. రైతులకు రూ.20వేలు, అమ్మకు వందనంకు రూ.15 వేలు, మహిళలకు రూ.15వేలు ఇంకా ఎన్నో పధకాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ …………..తమ కుటుంబం పై ప్రేమ తో తనను ఎమ్మెల్యే చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల పై కేసులు పెడితే బయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో బొట్లపాలెం ఘటనలో నిరసన తెలపాలని కోరితే కార్యర్తలు బారీగా స్పందించారని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ఇటీవల మహిళలపై అత్యాచారాలు ఎన్నో జరిగాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆహామీ అమలు చేయలేదన్నారు. ఉచిత ఇసుక గాలికి వదిలేశారన్నారు. ఉచితం పేరుతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా ఇసుకను దోచుకుతింటున్నారని చెప్పారు. నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు ఉంటారని ప్రతి కార్యకర్తతో మాట్లాడి వారి సాదక బాదలు తెలుసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో అన్ని మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






