దర్శి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఘనంగా నిర్వహించారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘానికి సేవకుడు జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే బడుగు బలహీన వర్గాలకు వర్గాలకు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అమిన్ భాష, జిల్లా ఏంపీటీసీ సంఘం అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , జయ సింహా రెడ్డి , వెంకట రెడ్డి , మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, కౌన్సిలర్ బాబు, జగన్, మజ్ను వలి తదితర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటి వర్గాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
