విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో అవగాహనతో ముందుకు సాగాలని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న కోరారు. తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇస్తున్న ప్రొత్సాహాన్ని ఉపయోగించికుని చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇంగ్లీషు, గణితంపై ప్రత్యేక పట్టు సాధించాలని కోరారు. సమాజంలో వివిధ రకాల మనుషులు తమపై చూపిస్తున్న ప్రేమ, అప్యాయతతో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. బాల్య వివాహాలకు ఎట్టి పరిస్థితులలో ప్రొత్సహించ వద్దని తమతో పాటు సమాజంలో ఎక్కడైనా అవగాహన లేకుండా జరుగుతున్న బాల్య వివాహాలను కూడ అడ్డుకోవాలని కోరారు. విద్యార్థులు భవిష్యత్లో ఎమి సాధిస్తారో అన్న విషయాలను వారి నుండి రాబట్టారు. మధ్యాహ్న భోజన పధకాన్ని పరిశీలించారు. ముందుగా బొద్దికూర పాడులో నూతనంగా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలు పంపిన పెంట్రోల్ పంపు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ రావు, విఆర్ఓ రమణా రెడ్డి, సిబ్బంది ఉన్నారు.


