చంద్రగిరి ,తూర్పు గంగవరం పాల డైరీలలో పోలీసులు, ఫుడ్ సెఫ్టీ అధికారులు గురువారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా పాల కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉండటంతో పాల డైరీలలో అకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఫుడ్ సెప్టీ అధికారి నరసింహారావు తెలిపారు. పాల కేంద్రాల సేకరణ వారు కూడ కల్తీ పాలను గుర్తించి మంచి పాలను మాత్రమే సేకరించాలని కోరారు. ఆరోగ్యానికి హానికర మైన పాలు సేకరిస్తున్నట్లు గుర్తించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రగిరిలోని శ్రీరామ్ డైరీ ని , తూర్పు గంగవరం లోని తేజ డైరీలో పాలను క్షుణ్ణంగా పరిశీలించారు .దర్శి సీఐ రామారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

