సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహాత్మా జ్యోతి బా పూలే లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి ఆశయాలను, వారి ఆదర్శాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిభా ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం ఒంగోలు నగరంలోని నూతన కూరగాయల మార్కెట్ వద్ద గల మహాత్మా జ్యోతి బా పూలే విగ్రహానికి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎపి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, నగర మేయర్ గంగాడ సుజాత, వివిధ బిసి సంఘాల ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…. ఈ రోజు మహాత్మా జ్యోతి బా పూలే వర్ధంతి సంధర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలకట్టలేనివన్నారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికినీ ఆనాటి సామాజిక రుగ్మతలను రూపుమాపాలంటే విద్య తోనే సాధ్యమని గ్రహించి, తను చదువు కోవడంతో పాటు మహిళా విద్యను ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతలను సమాజం నుండి తరిమికొట్టేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. వారి దంపతుల ఇద్దరు కూడా ఆనాడు సమాజమలో నెలకొన్న వివక్షత, మూఢ నమ్మకాల పై ఉద్యమాలు చేశారని మంత్రి అన్నారు. ఈ రోజు వారు చనిపోయి దగ్గర దగ్గరగా 130 సంవత్సరాలు అయినప్పటికినీ వారి సేవలను గుర్తు పెట్టుకుంటూ జాతి యావత్తు వారికి నివాళి ఆర్పిస్తున్నారంటే వారి చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేమన్నారు. ఈ రోజూ వారే కాదు డా. బి.ఆర్ అంబేడ్కర్ వంటి వారు సమాజానికి చేసినటువంటి సేవలు మనకు స్పూర్తిదాయకమన్నారు. పూలే దంపతులు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. దేశంలో మహిళా విద్యకు ఆద్యులు పూలే దంపతులని, జ్యోతి బా పూలే, డా. అంబేద్కర్ స్ఫూర్తితో సమాజంలో అసమానతలు తొలగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. సాంఘిక సంఘ సంస్కర్త, మహిళల అభివృద్దికి, సమ సమాజ స్థాపన స్పూర్తిదాత అయిన మహాత్మా జ్యోతి బా పూలే వర్ధంతి సంధర్భంగా ఈ రోజు వారికి నివాళి అర్పించడం జరిగిందన్నారు. వారు స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటుచేసి మహిళా విద్యకు కృషి చేశారన్నారు. అదేవిధంగా ఆనాడు సమాజంలో వున్న కుల వివక్షతను, మూఢ నమ్మకాలపై పోరాడన్నారు. అన్నీ రంగాల్లో వారు సేవలను అందించి తనదైన ముద్ర వేసుకున్న మహనీయులు మహాత్మా జ్యోతి బా పూలే అని, వారిని మనమంతా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని మన ప్రకాశం జిల్లాను కూడా ఒక సమసమాజ సమగ్రాభివృద్దికి, వంద శాతం అక్ష్యరాస్యత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు
ఎపి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ మాట్లాడుతూ…. సామాజిక వివక్షతకు, అసమానతలకు వ్యతిరేకంగా 200 సంవత్సరాల కితమే పోరాడిన మహనీయులు మహాత్మా జ్యోతి బా పూలే అని అన్నారు. సమాజంలో అన్నీ వర్గాలు సమ భాగంగా, సమానంగా ఉన్నప్పుడే సమాజం కూడా గౌరవ ప్రదంగా, అభివృద్ది పధంగా వుంటుందన్న ఆలోచనతో సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతి బా పూలే అని అన్నారు. ఆనాడు శూద్రులు, మహిళలు విద్యకు దూరంగా వున్నారని గ్రహించి సమాజం విద్యతోనే అబివృద్ది సాధ్యమౌతుందని విశ్వసించి మహిళా విద్యకు కృషి చేసి దేశంలో సామాజిక చైతన్యానికి నాంధి పలికారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మాకు గురువు, మాకు చైతన్య స్ఫూర్తి అని డా. బి. ఆర్ అంబేడ్కర్ చెప్పారన్నారు. వారిని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరిగే రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ….. రెండు వందల సంవత్సరాల క్రితమే ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘీక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతి బా పూలే అని అన్నారు. స్త్రీ విద్య ఆవశ్యకతను గుర్తించి తన భార్య ను కూడా చదివించి మహిళా విద్యకు కృషి చేసిన మహనీయులన్నారు.
ఈ కార్యక్రమంలో బి.సి కార్పొరేషన్ ఈడి వేంకటేశ్వర రావు, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి అంజల, మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్వర రావు, ఎస్. సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు
నీలం నాగేంద్ర రావు, గంట సుబ్బారావు, దారా అంజయ్య, బంకా చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

