సామాజిక విప్లవకారుడు.. పూలేజిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ – వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వూలే వర్ధంతి -పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవి

దేశంలో సామాజిక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన తొలి తరం విప్లవకారుడు మహాత్యా జ్యోతీరావు పూలే ఆదర్శాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్
ఛైర్పర్సన్ బూదేవల్లి వెంకాయమ్మ అన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక వైఎస్సార్ సీపీ- జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శిషప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవి పార్టీ నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …..దేశంలో మహిళల కోసం తొలి పాఠశాలను నెలకొల్పి మహిళా విద్యను ప్రోత్సహిం చిన అభ్యుదయవాది పూలే అని కొనియాడారు. మహిళలు చదువుకుంటే మొత్తం కుటుంబం చదు వుకున్నట్లేనని భావించి తన భార్య సావిత్రిజాయి పూలేను చదివించడమే కాకుండా ఆమెతో మహిళ లకు చదువు చెప్పించారన్నారు. పూల్ చూపిన బాటలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిచారని, ఆయన హయాంలో మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలన్నింటినీ మహిళల పేరు తోనే మంజూరు చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ …అణ గారిన వర్గాల- విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి -చేసిన గొప్ప సంఘ సంస్కర్త వూలే అని, ఆయన.. జీవితాన్ని అందరూ అద్యయనం చేయాలని కోరారు. సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్య తను పారద్రోలి దాన్ని తిప్పికొట్టి సమసమాణాన్ని నిర్మించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. సామాజిక అసమానతలపై అలు పెరుగు పోతాటం చేసి ఖావితకాలకు మార్గద ర్శిగా నిలిచారన్నారు. అలాంటి నాయకుడి స్ఫూర్తిగా వైఎస్సార్ సీపీ తరపున తమ అధినేత
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులమంతా పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి పా లనలో బీసీలకు గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి అధికారం లో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. విద్య తోనే అభివృద్ధి సాధ్యమన్న పూలే ఆలోచనలకు అనుగుణంగా విద్యారంగంలో అనేక మార్పులను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చుండూరి చుండూరి రవి మాట్లాడుతూ ….. మహిళా విద్యతోనే కుటుంబాలు సమగ్రాభివృద్ది చెందుతాయని, మహిళలకు సమాన గౌరవం దక్కుతుందని 140 సంవత్సరాల క్రితమే ఆలోచించిన పూలే.. దేశానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు… ఆ మహనీయుల ఆలోచనలకు అనుగు ణంగా వైఎస్సార్ సీపీ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తన ఇంటి నుంచి సంస్కరణలను ప్రారంభించిన మహోన్నత వ్యక్తి పూలేను స్మరించు కోవడం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద అక్రమ కేసులు పెడుతూ ప్రజల వాక్ స్వాతంత్యాన్ని హరిస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిం చడు మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కరాఠి శం కర్, సాంస్కృతిక విభాగం జోనల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, పార్టీ సీనియర్ నాయకులు బొట్ల రామారావు, క్రాంతికుమార్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రానాన్, కార్పొరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వరరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కటారి ప్రసాద్, నగర మైనారిటీ సెల్- మాజీ చైర్మన్ షేక్ మీరావలి, మైనారిటీ నాయకులు షేక్ జిలాని, 14వ డివిజన్ అధ్యక్షుడు చావలి శివ, భూమిరెడ్డి రవణమ్మ, వాణి, కుట్టుబోయిన కోటి యాదవ్ , తేళ్ల విక్టర్ పాల్, తాతా నరసింహగౌడ్ , పిగిలి శ్రీనివాసరావు, హౌసింగ్ బోర్డు చిన్న, సాగర్, మధు, భాస్కర్, రొండా అంజిరెడ్డి, రమేష్.. ముల్లంగి రవీంద్రారెడ్డి ప్రవీణ్ వెంకయ్య నాయుడు, పి.శ్రీను, శ్రీనివాసరెడ్డి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *