మత్స్య శాఖ లో జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా, రాష్ట్ర మేరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య శుక్రవారం మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పాలేరు, మూసీ నదులు సముద్రంలో కలిసే ప్రదేశంలో పూడిక తీత పనులపై శింగ రాయ కొండ మండలం పాకల గ్రామంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులు, కొత్త పట్నం మండలం పల్లె పాలెంలో షిషింగ్ హార్బర్ నిర్మాణ స్థితి గతులపై చర్చించారు. జిల్లాలోని ఆక్వా సాగు, రైతులు వినియోగిస్తున్న మేత నిషిద్ధ యాంటీ బయాటిక్స్ రహిత సాగు పద్ధతులపై రైతులకుఅ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యాంటీ బయాటిక్స్ నిర్మూలించే విధంగా తగు చర్యలు చేపట్టుటకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర మేరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సూచించారు. ఇప్పటికే తీసుకుంటున్న చర్యలపై జిల్లా మత్స్య శాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.

