విద్యార్థులకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రధా నోపాధ్యాయులు అవగాహన కల్పించాలని దర్శి డీఎస్పీ లక్ష్మీనారా యణ సూచించారు. దర్శి మండల ప్రజాపరిషత్ సమా వేశం హాలులో ప్రధానోపాధ్యా యులకు సైబర్ నేరాలువిషయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ …సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ , మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాల గురించి వివరించారు. తాము పని చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. వాటిపై గ్రామస్తులు, స్నేహితులు వారి బంధువులతో పాటు తెలిసిన వ్యక్తులకు కూడా అవగాహ కల్పించి నేరాలు తగ్గు ముఖ్యం పట్టేందుకు సహ కరించాలని విజ్ఞప్తి చేశారు. సీఐ రామారావు, ఎస్సై మురళి, ఎంఈఓలు కాకర్ల రఘురామయ్య, రమాదేవి పాల్గొన్నారు.
