సామాజిక దృష్టి కోణంతో ఫోటోలు తీయాలి -నైతిక విలువలకు ప్రాధాన్యతనివ్వాలి-వాస్తవికతకు దర్పణం ఫోటో – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ఆచార్య కె.రామ మోహన్ రావు

ఈతరం ఛాయాచిత్రగ్రాహకులు సామాజిక దృష్టి కోణంతో ఫోటోలు తీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా& ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాత్రికేయ విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 132వ ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ దినోత్సవం విశ్వవిద్యాలయంలో వైభవంగా నిర్వహించారు .పాత్రికేయ విద్యా విభాగం ఇన్ ఛార్జ్ సంచాలకులు ఆచార్య జే.మధుబాబు అధ్యక్షతత న జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె రామ మోహన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె రామ మోహన్ రావు మాట్లాడుతూ .. ….. ఫోటోగ్రాఫర్లు నైతిక విలువలను పాటించాలని ఈనాటి ఫోటోలు భవిష్యత్ తరాల వారికి సాక్షీ భూతాలవుతాయని ఈనాటి వర్తమాన పరిస్థితులను వివరించే నేటి ఫోటోలే భవిష్యత్ తరాల వారికి చరిత్రను విశదీకరించే వాస్తవిక ఆధారాలుగా పరిగణించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే ఫోటోలో ఎలాంటి మార్పులు లేకుండా వ్యక్తికరించాలని అప్పుడే ఆ ఫోటోకి సహజమైన వాస్తవికత ఉంటుందని ఆయన సూచించారు. వాస్తవికతకు ఫోటోనే దర్పణం అని విలువలతో కూడిన వ్యక్తిత్వంతో ఆలోచనత్మక దృష్టితో ఫోటోలను తీయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్,లా కళాశాల ప్రాధానాచార్యులు ఆచార్య ఎమ్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ……. విశ్వవిద్యాలయంలో ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థినీ విద్యార్థులు ఆసక్తి మేరకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దూర విద్యాకేంద్ర సంచాలకులు ఆచార్య వి వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ కళాశాల ప్రాచార్యులు ఆచార్య పాల్ కుమార్, ఫోటోగ్రఫీ అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఫోటోగ్రఫీలో విశిష్టమైన భావాలతో ఫోటోలు తీసిన 25 మందికి పైగా ఫోటోగ్రాఫర్లకు బహుమతు లు అందించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *