సమాచార శాఖలో 40 ఏళ్లకు పైగా సర్వీసు చేసిన..డి.ఐ.పి.ఆర్.ఓ. గ్రేస్ లినోరా ఉద్యోగ విరమణ -ఘన సన్మానం

ప్రకాశం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి(డి.ఐ.పి.ఆర్.ఓ)గా పనిచేస్తున్న కె.గ్రేస్ లినోరా శనివారం ఉద్యోగ విరమణ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 40 సంవత్సరాల ఏడు నెలలకు పైగా ఆమె పనిచేశారు. గుంటూరు జిల్లాలో వివిధ హోదాలలో పనిచేసిన ఆమె 2019లో ప్రకాశం జిల్లాకు బదిలీపై వచ్చారు. సుదీర్ఘకాలం గుంటూరు జిల్లాలో పనిచేసిన ఆమె క్రమశిక్షణ, చిత్తశుద్ధి గల అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి, ఇతర వి.ఐ.పి.ల కార్యక్రమాల సందర్భంగా పబ్లిక్ అడ్రస్ సిస్టం నిర్వహణలో సమర్థవంతమైన అధికారిణిగా పలువురు కలెక్టర్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రకాశం భవనంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా డి.ఐ.పి.ఆర్. ఓ.గా బాధ్యతలు స్వీకరించిన పి.వేణుగోపాల్ రెడ్డి, డి.పి.ఆర్.ఓ. రమేష్, డివిజనల్ పీ.ఆర్.వో. దుర్గాప్రసాద్, రిటైర్డ్ డీ.ఈ.ఐ.ఈ. రమణమూర్తి, జిల్లాలోని సమాచార శాఖకు చెందిన వివిధ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *