కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి నిరుపేదకు అధికారులు అందించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) మరియు ఏపీ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ గారి అధ్యక్షతన వివిధ ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి తో కలసి జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అబివృద్ది, సంక్షేమ పధకాల అమలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు . ఈ సమావేశంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, సంతనూతల పాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బి.ఎన్. విజయకుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, ఎం.పి.పి.లు, జడ్పిటి సి లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లాలో అమలు జరుగుచున్న జాతీయ ఉపాధి హామీ పధకం, జల జీవన్ మిషన్ కార్యక్రమం, పీఎం సూర్య ఘర్ పథకం, పీఎం గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్ యోజన – టిడ్కో గృహాల నిర్మాణం పధకాల కింద పేదలకు గృహాల మంజూరు, అమృత్ 1, అమృత్ 2 పధకాల ద్వారా ప్రజలకు త్రాగునీటి పధకాలు అమలు, స్వయం సహాయక బృందాలలో “ లాక్ పతి దీదీ” లక్ష్యాలను, గ్రామాలలో నానో యూరియా పిచికారీ చేయడానికి స్వయం సహాయక బృందాలకు సబ్సిడీతో డ్రోన్ లు మంజూరు, లక్ష్యాల పురోగతి పై శాఖల వారీగా సమీక్షించడం జరిగింది. ఈ సమావేశాలలో పాల్గొన్న 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్, శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన రావు, డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బి.ఎన్. విజయకుమార్, వివిధ ప్రజా ప్రతినిధులు వివిధ అంశాలను ప్రస్తావించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ……. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపడుతున్న దాదాపు 40 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటికి చేసిన ఖర్చు వివరాలను సమీక్షిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన నిధులను మండలాలకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే సి సి రోడ్డు లు, మురుగు నీటి కాలువల నిర్మాణం, తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించిన లక్ష్యం మేరకు పుర్తిచేసేలా అధికారులు పని చేయాలన్నారు. ప్రతి ఇంటికి కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. జిల్లాలో జల జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలు, కార్యక్ర్తమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎంపి ల్యాడ్స్ కింద మంజూరయ్యే పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసే అంశం పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. వివిధ పధకాల కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి, చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిచేలా శాసన సభ్యులతో కలసి సమన్వయంతో పని చేస్తామన్నారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…… జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) మరియు ఏపీ 20 సూత్రాల కార్యక్రమాల అమలు సమావేశంలో జిల్లాలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అమలు జరుగుచున్న కార్యక్రమాలు, పనుల పురోగతి గురించి చర్చించడం జరిగిందన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి 2014-19 కాలంలో మంజూరు కాబడి పెండింగ్ లో వున్న సుమారు 27 వేల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా లోని అన్నీ నియోజక వర్గాల్లో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేపట్టిన తాగునీటి పధకాలు త్వరితగతిన పూర్తీ చేసేలా చర్యలు చేపట్టేలా చర్చించడం జరిగిందన్నారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పధకం కింద జిల్లా లో జరుగుచున్న సిసి రోడ్లు, సైడు కాలువల నిర్మాణాలు త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో సూర్య ఘర్ పధకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. భారత దేశంలో అత్యధిక మొత్తంలో ఫింఛన్ ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం, ఆభివృద్ధి కార్యక్రమాల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు.
20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ మాట్లాడుతూ…… జల జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను సత్వరమే పూర్తిచేసి ప్రజలకు అవసరమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద చేపట్టిన రహదారులను వెంటనే పుర్తిచేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరానికి పశ్చిమ వైపు బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం వుందన్నారు. స్వయం సహాయక బృందాలలో “ లాక్ పతి దీదీ” లక్ష్యాలను అందుకోవడం శుభపరిణామం, ఇంకా మరింత మందిని లాక్ పతి దీదీలు గా మార్చి పేదరికాన్ని తగ్గించాలని చెప్పడం జరిగింది, రాబోయే సంవత్సరానికి కనీసం 2.50 లక్షల మంది ప్రకాశం జిల్లాలో మందిని లాక్ పతి దీదీలుగా తయారు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గ్రామాలలో నానో యూరియా పిచికారీ చేయడానికి స్వయం సహాయక బృందాలకు “ డ్రోన్ “ లను 8 లక్షల వరకు సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నందున రాబోయే ఆర్థిక సంవత్సరంలో కనీసం ప్రతి గ్రామ పంచాయితీలో ఒక డ్రోన్ అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధ చెయ్యాలని అధికారులకు సూచించారు. పీఎం సూర్య ఘర్ “ పథకం మ కింద జిల్లాలో 2026 – 27 నాటికి కనీసం 5 లక్షల ఇండ్లకు సోలార్ ప్లాంట్ లు అమర్చేలా ప్రజలను ప్రోత్సహించేలా అధికారులు కృషి చేయాలన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ……. ఒంగోలు నగరానికి పశ్చిమ వైపు బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం వుందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలన్నారు. అమృత్ పధకం కింద చేపట్టిన పనులు పూర్తి చేసినట్లయితే ఒంగోలు నగరానికి ప్రతి రోజు తాగునీరు ఇవ్వవచ్చని అన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బి.ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ……. పెర్నిమిట్ట వద్ద గల చెరువును అమృత్ పధకంలో చేర్చాలని, అలాగే గుండ్లకమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి రెండు మోటార్లు పనిచేయడం లేదని, కొత్త మోటార్లు ఏర్పాటుచేయాలన్నారు.
కనిగిరి శాసన సభ్యలు డా. ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ……..ఎన్.హెచ్ 565 జాతీయ రహదారి లో మగ్గంపల్లి వద్ద లైట్స్ పనిచేయడం లేదని, ప్రమాదాలు జరుగుచున్నవని, లైట్లు వేయాలని కోఅరడం జరిగింది. అలాగే త్రాగునీటి పధకాలకు సంబంధించిన కొత్త పైప్ లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం ఉందన్నారు.
గిద్దలూరు ససన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గిద్దలూరు పట్టణానికి సంబంధించి బై పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం వుందని కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సి.ఈ. ఓ చిరంజీవి, సి.పి.ఓ వెంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




